Gujarath: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ .. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణం

by vinod kumar |
Gujarath: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ .. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణం
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్ జిల్లా బోర్సరన్ గ్రామంలో మైనర్ బాలిక తన స్నేహితుడితో కలిసి మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రామ సరిహద్దులో నిలబడి ఉంది. ఈ క్రమంలోనే వారి వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన స్నేహితుడిని దారుణంగా కొట్టారు. దీంతో అతను అక్కడి నుంచి పారిపోగా.. అనంతరం నిందితులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక మరో స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ బైక్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ నెల 4వ తేదీన కూడా వడోదరలోని భయాలీలో మైనర్‌పై సామూహిక లైంగిక దాడి జరగడం గమనార్హం.

Advertisement

Next Story