నా కొడుకు రెండు వారాలుగా బాధలో ఉన్నాడు.. తండ్రిగా అలా చూస్తుంటే బాధగా ఉంది: అల్లు అరవింద్

by Mahesh |   ( Updated:2024-12-21 16:06:47.0  )
నా కొడుకు రెండు వారాలుగా బాధలో ఉన్నాడు.. తండ్రిగా అలా చూస్తుంటే బాధగా ఉంది: అల్లు అరవింద్
X

దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ మరోసారి తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన ఎవరూ ఊహించని ప్రమాదమని.. ఇందులో ఎవరి తప్పు లేదని.. కానీ కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆస్పత్రిలో ఉన్న శ్రీ తేజను తాను కలిసేందుకు ఎప్పుడో సిద్ధం అయ్యానని, లీగల్ సమస్యలు తలెత్తుతాయని లాయర్లు చెప్పడంతోనే తన అభిమానిని కలవలేక పోతున్నానని చెప్పుకొస్తు ఎమోషనల్ అయ్యారు. అనంతరం అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మత అల్లు అరవింద్ మీడియాతో మాడ్లాడుతూ.. తన కొడుకు ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన సినిమాలో నటించాడనే గర్వం తనకు లేకుండా పోయిందన్నారు.

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన నాటి నుంచి తన కొడుకు బాధలో ఉన్నాడని రెండు వారాల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా.. ఇంట్లోనో, గార్డెన్ లోని ఓ మూలన కూర్చొని బాధ పడుతున్నాడని.. వాడిని అలా చూస్తుంటే తనకు బాధగా ఉందని అల్లు అరవింద్ కూడా ఎమోషనల్ అయ్యాడు. అలాగే బాధగా ఉన్న బన్నీని చూసి బయటికి వెళ్లమని, స్నేహితుల వద్దకు వెళ్ళమని అడిగానని.. కానీ బాధతో బయటకు కూడా వెళ్లలేదని, తప్పుడు సమాచారంతో అల్లు అర్జున్‌పై అనేక మంది మాట్లాడుతున్నారని, లీగల్‌గా అవగాహన తీసుకొని బన్నీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాడని, నేటి ఘటనలతో వ్యక్తిగతంగా మాకు బాధేస్తున్న అంశంపై మాత్రమే మాట్లాడేందుకు మీడియా వచ్చామని, శ్రీతేజ్‌ను ఆర్థికంగా, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Read More...

Allu Arjun : నా క్యారెక్టర్ దిగజార్చే అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు : అల్లు అర్జున్


Advertisement

Next Story

Most Viewed