యువతను కలవరపెడుతోన్న ఈ సమస్య.. లక్షణాల్ని ముందే గుర్తించకపోతే..

by Anjali |   ( Updated:2024-12-21 16:02:21.0  )
యువతను కలవరపెడుతోన్న ఈ సమస్య.. లక్షణాల్ని ముందే గుర్తించకపోతే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల యువత ఎక్కువగా ఫేస్ చేస్తోన్న సమస్యలో ఫ్యాటీ లివర్ సమస్య(fatty liver disease) ఒకటి.‘ కొవ్వు కాలేయ వ్యాధి యొక్క లక్షణాలు NASH ఎటువంటి లక్షణాలను కలిగించకుండా సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. వ్యాధి మరింత తీవ్రమైతే, మీరు అలసట, బరువు తగ్గడం(Weight loss), పొత్తికడుపులో అసౌకర్యం(Abdominal discomfort), బలహీనత(Weakness), గందరగోళాన్ని సృష్టించడం ఫ్యాటీ లివర్ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజు రోజుకు యువతలో ఈ సమస్య పెరుగుతోంది.

దీనికి ముఖ్యకారణం ఆల్కహాల్(Alcohol) సేవించడంతో పాటు బయట జంక్ ఫుడ్(Junk food) ఎక్కువగా తీసుకోవడం కారణమంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఒత్తిడి(stress), నిద్రలేమి సమస్యలు(Insomnia problems) కూడా కొవ్వు కాకలేయ వ్యాధికి దారితీస్తున్నాయట. కాగా లక్షణాలను కనుక ముందే గుర్తిస్తే ప్రాణాల్ని కాపాడుకున్న వారు అవుతారని.. ఎలా ఈ వ్యాధి నుంచి బయటపడాలో నిపుణులు చెప్పిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో ప్రధాన లక్షణం ఒకటి కాలేయ పరిమాణం పెరగడం(Liver enlargement). లివర్ ఉన్న ప్లేస్‌లో స్కిన్ కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అలాగే ఆ స్థలంలో నొక్కితే పెయిన్ వస్తుంది. లివర్ పరిమాణం పెరగడాన్నే హెపాటోమెగాలి(Hepatomegaly) అని అంటారు. అలాగే పాదాలు వాపు(Swollen feet) రావడం కూడా ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో కనిపిస్తుంది. జీర్ణవ్యవస్థ(digestive system) పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫుడ్ సరిగ్గా డైజేషన్ అవ్వదు. తరచూ వికారంగా అనిపిస్తుంది. ఏ చిన్న పని చేసినా వెంటనే అలసిపోతారు.

నైట్ పడుకున్నా కూడా మార్నింగ్ అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఆహారం తిన్న వెంటనే పొట్ట ఉబ్బుతుంది. శరీరంలోని వ్యర్థాలు సరిగ్గా బయటకు పోవు. అంతేకాకుండా స్కిన్‌పై దురద వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతోన్న వారిలో కొంతమందిలో స్కిన్ పై దద్దుర్లు కూడా ఏర్పడతాయి. కాగా ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే డాక్టర్‌ను సంప్రదించి.. టెస్ట్స్ చేయించుకోవడం మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More...

Urine infections: తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఈ సమస్య ఓ కారణమే..?





Advertisement

Next Story

Most Viewed