మేకపిల్లను కాపాడబోయి మృత్యువాత

by Sridhar Babu |   ( Updated:2024-12-21 15:41:50.0  )
మేకపిల్లను కాపాడబోయి మృత్యువాత
X

దిశ,తిరుమలాయపాలెం : మేత మేస్తూ మేక పిల్ల బావిలో పడిపోగా దానిని కాపాడేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన ఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన గద్దల ఉపేందర్-రేణుక దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు నాగచైతన్య (15) జగన్నాథపురం పరిసర ప్రాంతాల్లో తన తాతతో కలిసి జీవాలు మేపేందుకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యవసాయ బావి దగ్గర మేక పిల్ల మేతమేస్తూ బావిలో పడిపోగా గమనించిన యువకుడు మేకపిల్లను కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు.

Advertisement

Next Story

Most Viewed