తల్లాడ మండల అభివృద్ధికి కృషి చేస్తా..: సత్తుపల్లి ఎమ్మెల్యే

by Aamani |   ( Updated:2024-10-09 15:07:25.0  )
తల్లాడ మండల అభివృద్ధికి కృషి చేస్తా..: సత్తుపల్లి ఎమ్మెల్యే
X

దిశ,తల్లాడ: తల్లాడ మండల అభివృద్ధికి కృషి చేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. బుధవారం తల్లాడ లో గ్రామపంచాయతీ కార్మికులకు దసరా కానుకగా ప్రభుత్వం అందించిన లేబర్ ఇన్సూరెన్స్ పట్టాలు, యూనిఫామ్స్ తో పాటు వంట సామాగ్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత లో పంచాయతీ కార్మికుల పాత్ర గొప్పదని అన్నారు.

శ్రామికులకు అండగా లేబర్ కార్డులు ఉండాలన్నారు. అనంతరం తల్లాడ రింగ్ సెంటర్లో ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటెన్, హైమస్ లైట్లు ప్రారంభించారు. తల్లాడ లో సెంటర్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని నాయకులు కోరగా స్పందించిన ఎమ్మెల్యే విషయం జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సాంక్షన్ చేపిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కాలేజ్ ఏర్పాటు కు తగిన స్థలాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవికుమార్,ఎండిఓ చంద్రమౌళి, ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి , ఈవోకృష్ణారావు, ఎస్సై కొండలరావు, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్, మాజీ ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి, మాజీ వ్యవసాయ శాఖ చైర్మన్ దివ్వెల కిష్ణయ్య, దొండేటి వీరారెడ్డి, కటికి కిరణ్, నీలాద్రి ఆలయ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డి, బొడ్డు నరసింహారావు, రాయల రాము,తాళ్ల జోసెఫ్, తుమ్మలపల్లి రమేష్, మారెళ్ళ మల్లికార్జునరావు, హెచ్డి కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ మూకర్ల ప్రసాద్, సామినేని రామ అప్పారావు, ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed