గ‌చ్చిబౌలి స్టేడియంలో ప్ర‌పంచ ధ్యాన దినోత్స‌వ వేడుకలు

by Kalyani |
గ‌చ్చిబౌలి స్టేడియంలో ప్ర‌పంచ ధ్యాన దినోత్స‌వ వేడుకలు
X

దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం- ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ.. రామ‌చంద్ర మిష‌న్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా డిసెంబ‌ర్ 21న తొలి ప్ర‌పంచ ధ్యాన దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని ఐక్యరాజ్య స‌మితి నిర్ణ‌యించిన నేప‌థ్యంలో తొలి వేడుక‌ల‌కు హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి స్టేడియం వేదికైంది. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌, పీఏసీ చైర్మెన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ (దాజీ)తో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

అనంతరం వారు మాట్లాడుతూ… తొలి ప్ర‌పంచ ధ్యాన దినోత్స‌వ వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, శ్వాస మీద ధ్యాసే ధ్యానం అని, ధ్యాన్యం మీలోని శక్తిని మేలుకొల్పుతుందన్నారు. ధ్యానం మానసిక ప్రశాంతతనే కాదు శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుందని, ప్రతి ఒక్కరు ప్రతి రోజు కాసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఒత్తిడి నుండి విముక్తి పొందే ఏకైక మార్గం ధ్యానం అని, ఇది మనసుకు అతీతమైన పరిణామమని, ఒత్తిడి, సంఘర్షణలు అనేవి మానసిక మైనవన్నారు. ధ్యానం స‌మ‌గ్ర ఆరోగ్యానికి ప‌రిష్కారమన్న వారు ప్ర‌తిరోజు ధ్యానం చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రస్తుత రోజులలో ధ్యానానికి మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉందని, జీవన గమనంలో ధ్యానంది ప్రత్యేక స్థానమని అన్నారు. ధ్యానం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని,

ధ్యానం మన ప్రాచీన సంస్కృతులలో ఒకటని గుర్తు చేశారు. ప్రాచీన కాలంలో ధ్యానం, విద్య, ఆధ్యాత్మిక కారణాల వలన ప్రాచుర్యం పొందితే, నేటి కాలంలో ఆరోగ్య కారణాల వలన ప్రాచుర్యం పొందిందని, ధ్యానం అనగా సాధన చేయడం, మనస్సు మీద ఏకాగ్రత సాధించటం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిచుకోవడ వల్ల అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం పొందగలమని అన్నారు. నియమాలు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణా పాటించాలని, ప్రాణాయామం వలన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగి శరీరము చురుకుగా ఉంటుందన్నారు. ధ్యానం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, ధ్యానం ఏ మతానికి సంబంధించినది కాదని.. ఇది మన సనాతన జీవన విధానం అని తెలిపారు. అందరూ కులమతాలకు అతీతంగా ధ్యానం సాధన చేసినట్లైతే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని, ముఖ్యంగా విద్యార్థులు యువకులు నిత్య సాధన చేసినట్లైతే ఏకాగ్రతతో పాటు పట్టుదల, దృఢ సంకల్పం ఏర్పడి జీవితంలో వారు అనుకున్నది సాధించగలుగుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed