- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించిన తెలుగు కుర్రాడు.. ఏడు సిక్సర్లతో రెచ్చిపోయాడుగా
దిశ, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతుంది. ఓపెనర్లు సంజు, అభిషేక్ 25 పరుగులకే అవుట్ అయ్యారు, అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకంగా 7 సిక్సర్లు, 4 ఫోర్లతో కేవలం 34 బంతుల్లో 74 పరుగులు చేశాడు. దీంతో భారత్ 14 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. మరో పక్క రింకు సింగ్ కూడా తనకు స్ట్రైక్ వచ్చిన ప్రతి సారి ఫర్ ఫెక్ట్ షాట్లతో నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతుంది. కాగా ఈ మ్యాచులో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో అతి తక్కువ వయస్సులు వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి చేరాడు.