- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హర్యానా ఫలితాలపై అనుమానాలు.. ఈసీకి మల్లు రవి రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: హర్యానా ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలున్నాయని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరిగినా, ఆ వెంటనే బీజేపీ విజయం సాధించిందని ఇందులో ఈవీఎంలలో కొంత గందరగోళం జరిగినట్టు అనుమానాలున్నాయని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయం సాధించిన నియోజక వర్గాలలో ఈవీఎం లో 65 శాతం ఛార్జింగ్ ఉండగా, బీజేపీ గెలిచిన నియోజక వర్గాలలో 99 శాతం ఛార్జింగ్ ఉందని, ఇది ఎలా సాధ్యమో ఈసీ క్లారిటీ ఇవ్వాలన్నారు. హర్యానా ఎన్నికలలో జరిగిన ఫలితాల అవకతవకలపై ఎన్నికల కమిషన్ సమగ్ర వివరణ ఇవ్వాలని అన్నారు.
ఎన్నికల కమిషన్ రౌండ్ల వారీగా వివరాలు ఇవ్వలేదని, మొదట్లో కాంగ్రెస్ కు ఘన విజయం సాధించే సీట్లు వస్తున్నట్టు అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని అంతకు ముందు ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉందని, మరి ఎలా బీజేపీ గెలిచిందని ప్రశ్నించారు. ఇలా ఎన్నికలు జరిగితే వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుందని, ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.