రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం

by M.Rajitha |
రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్ : టాటాసన్స్ అధినేత రతన్ టాటా(Ratan Tata) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. రాయిటర్స్ నివేదిక ప్రకారం టాటా అధినేత ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టాటా ఆరోగ్యం గురించి శుక్రవారం ఉదయం అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే రెండు రోజుల కింద సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళగా పలు మీడియా సంస్థలు అనారోగ్యం అంటూ కథనాలు ప్రసారం చేశాయి. కాని రతన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు టాటా వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

Advertisement

Next Story