ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్

by Harish |
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్
X

దిశ, నేషనల్ బ్యూరో: శనివారం ఇరాన్ డ్రోన్‌లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయగా, పశ్చిమాసియాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ దాడులు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని, దీనిని వెంటనే ఆపివేయాలని రెండు దేశాలను కోరుతుండగా, ఈ ఆందోళనలపై పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం స్పందించారు. మిడిల్ ఈస్ట్‌ను మరింత పెద్ద సంఘర్షణలోకి లాగే ప్రమాదంతో కూడిన ఈ చర్యలను వెంటనే ఆపివేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో యాత్రికులతో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడి వార్తలను ఆందోళన, బాధ కలిగించాయి. ఇలాంటి హింసను పెద్దవి చేయవద్దని రెండు దేశాలను కోరారు. ఎవరూ ఇతరుల ఉనికిని బెదిరించకూడదు. అన్ని దేశాలు శాంతి కోసం నిలబడాలి. ఇజ్రాయెల్- పాలస్తీనియన్లు రెండు పక్కపక్కనే సురక్షితంగా ఉండటానికి సహాయం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. గతంలో కూడా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి ఘటన సమయంలో పోప్ స్పందించారు. ఇజ్రాయెలీ బందీలను వదిలి, మానవతా సహాయం అందించడానికి అనుమతించేందుకు గాజాలో కాల్పుల విరమణ, చర్చలకు పోప్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story