- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Drug supply : మాదక ద్రవ్యాల సరఫరా.. ఇద్దరు అరెస్ట్
దిశ,చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే ఇద్దరు వ్యక్తులు చౌటుప్పల్ పోలీసులకు చిక్కారు. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు కథనం ప్రకారం..హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఇద్దరు వ్యక్తులు నిషేధిత మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నారంటూ స్థానిక ఎస్.ఐ లక్ష్మయ్యకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్.ఐ లక్ష్మయ్య తమ సిబ్బందితో బుధవారం రాత్రి పంతంగి టోల్ ప్లాజా వద్ద మాటు వేసి కూర్చున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేయడంతో.. హైదరాబాద్ లింగంపల్లి నుంచి చౌటుప్పల్ మీదుగా రాజస్థాన్‌కు అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ( జీజె 13 ఎన్ఎన్ 7078) అనే మారుతీ స్విఫ్ట్ కారును పోలీసులు అడ్డగించారు. కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఖైదీలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు ఖైదీలు ఏ-1 నిందితుడిగా ఛైల్ సింగ్(38), A-2 నిందితుడిగా సుమేర్ సింగ్ అలియాస్ సుమేర్ (29) లపై కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులు తమ కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 100 గ్రాముల బరువున్న మాదక ద్రవ్యాల రెండు ప్యాకెట్లను సీజ్ చేసి..నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు పర్యవేక్షణలో స్థానిక ఎస్.ఐ లక్ష్మయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.