- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిబంధనలు గాలికి....అమ్మకాలు యథేచ్ఛగా...
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ లో టపాసుల విక్రయ కేంద్రాల్లో నిబంధనలు గాలికి వదిలి విక్రయాలు జరుపుతున్నారు. ఒక వైపు ను నిబంధనల ప్రకారం అమ్మకాలు జరపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా అమ్మకం దారులు మాత్రం యథేచ్చగా తమ అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం షాప్ కు షాప్ కు మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలనే ప్రాథమిక నిబంధనను కాల దాన్ని ఏకంగా 16 షాపులు ఒకదాని పక్కన ఒకటి అంటుకుని నిర్మాణం చేపట్టి అమ్మకాలు చేపడుతున్నారు. ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా ఉంటే పర్మిషన్ ఇవ్వకూడదు అనే విషయం విస్మరించి పోలీసులు,ఫైర్ సిబ్బంది పర్మిషన్ ఎలా ఇచ్చారనే విషయం పై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టపాసుల షాప్ ల ముందు వరకు వాహనాలు వెళ్లకూడదని ఉన్న వాహనాలు షాప్ ముందరే నిలుపుతున్నా షాప్ ల యజమానులు పట్టించుకోవడం లేదు. నామ మాత్రంగా డ్రమ్ములు, గ్యాస్ లు ఉన్నా ఏదైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే మొత్తం షాప్ లు అగ్నికి ఆహుతి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 4 లక్షలకు పైగా విలువ గల టపాసులను స్వాధీనం చేసుకుని షాప్ లను సీజ్ చేసిన విషయం విదితమే.నిబంధనలు పాటించకపోయినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది లక్ష డాలర్ల ప్రశ్న...
లేబుల్ లేని టపాసుల అమ్మకం
లేబుల్ లేని టపాసుల విక్రయం జరుప కూడదని, ప్రజలు సైతం కొనకూడదని ప్రచారం చేస్తున్నా యథేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారు .లేబుల్ లేని జీరో టపాసులు అమ్మకాలు జోరుగా అమ్మకాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.