Attack : వైన్స్ లో వ్యక్తిపై దాడి..!

by Kalyani |
Attack : వైన్స్ లో వ్యక్తిపై దాడి..!
X

దిశ, నర్సంపేట: వైన్స్ లో మద్యం సేవిస్తున్న వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నర్సంపేట పట్టణంలోని సర్వాపురం దగ్గరలో గల భైరవ వైన్స్ లో చోటుచేసుకుంది. సర్వాపురానికి చెందిన లింగాల. సారంగం అనే వ్యక్తి మద్యం కోసం భైరవ వైన్స్ కి గురువారం మధ్యాహ్నం వెళ్ళాడు. మద్యం సేవిస్తుండగా ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో సారంగం తలకు గాయాలయ్యాయి. వైన్స్ షాపు నిర్వాహకుల సమాచారంతో ఘటనాస్థలికి బాధితుడి బంధువులు చేరుకుని అతన్ని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఈ ఘటనపై నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫీర్యాదు సైతం చేశారు. ఈ ఘటనపై ఎస్సై రవికుమార్ ని వివరణ కోరగా భైరవ వైన్స్ లో సారంగం అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు నిర్ధారించారు. సీసీ ఫుటేజీ గమనించినట్లు, వారిని పట్టణంలోని శాంతినగర్ కి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story