- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chamala: నీ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చు కేటీఆర్.. ఎంపీ చామల కిరణ్ సవాల్
దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్(KTRBRS) నీ ఎజెండా అదే అయితే నీ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్(TRS) గా మార్చాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) సవాల్(Challenge) విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన(Delhi Tour)పై బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన చామల కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఆయన.. కేటీఆర్ నీ ట్విట్టర్ ఖాతాలో రాసిన సుత్తి “కపిత్వం” గురించి వినే ఓపిక, తీరిక తెలంగాణ సమాజానికి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే నీ జెండా.. నీ ఎజెండా.. నిజంగానే తెలంగాణనే ఐతే, నీకు నా సవాల్! అంటూ.. నీ పార్టీ పేరును మళ్లీ “తెలంగాణ” రాష్ట్ర సమితి(Telangana Rastra Samithi) గా మార్చు అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా కేటీఆర్ రేవంత్ రెడ్డి మాటలపై స్పందిస్తూ.. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్, 28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యత అని ట్వీట్ చేశారు.