Samantha: ఇంటర్వ్యూలో డివోర్స్ గురించి మాట్లాడిన సమంత.. నెట్టింట దుమారం రేపుతోన్న సెన్సేషనల్ కామెంట్స్ !!

by Anjali |
Samantha: ఇంటర్వ్యూలో డివోర్స్ గురించి మాట్లాడిన సమంత.. నెట్టింట దుమారం రేపుతోన్న సెన్సేషనల్ కామెంట్స్ !!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్రతార సమంత(Samantha) రీసెంట్‌గా నటించిన సిటాడెల్: హనీ బన్నీ(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ రక్త్ బ్రహ్మండ్(Rakt Brahmand) అనే మరో వెబ్ సిరీస్‌తో తనలోని మరో కొత్త టాలెంట్‌ను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటిఫుల్ కథానాయిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు(Divorce), మయోసైటిస్(Myositis).. తను జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టపరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.

సమంత-నాగచైతన్య(Naga Chaitanya) విడాకులు తీసుకున్నాక.. సోషల్ మీడియాలో సామ్ ఏ రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కాగా సామ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయితే తప్పకుండా ఎవ్వరైనా సరే అమ్మాయిలనే అంటారని వెల్లడించింది. మనం అలాంటి సొసైటీలో బతుకుతుమన్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక అమ్మాయిల లైఫ్ అంతే, సెకండ్ హ్యాండ్(Second hand), యూజ్డ్ అంటూ డివోర్స్ అనంతరం అమ్మాయిలకు అలాంటి ట్యాగ్స్ తగిస్తారంటూ సామ్ ఫైర్ అయింది. మనుషులు ఇలా ఎందుకు మాట్లాడుతారో తనకు అర్థం కావట్లేదని పేర్కొంది. ఈ మాటలు మాత్రం అమ్మాయి ఫ్యామిలీని చాలా బాధిస్తాయని వెల్లడించింది.

అలా బాధలో ఉన్న అమ్మాయి గురించి.. ఇలాంటి మాటలు మాట్లాడి.. మరింత బాధపెట్టడం సరైంది కాదని, మరింత నిరాశపరుస్తాయని సామ్ వివరించింది. తన గురించి కూడా అనేక అబద్ధాలు సృష్టించారని తెలిపింది. అవన్నీ అవాస్తవాలు కాబట్టి స్పందించలేదని పేర్కొంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కష్ట సమయంలో సపోర్ట్ గా ఉన్నారని ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed