Social media effect : సోషల్ మీడియా అతి వినియోగం.. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుందా?

by Javid Pasha |   ( Updated:2024-11-26 07:54:16.0  )
Social media effect : సోషల్ మీడియా అతి వినియోగం.. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా.. ప్రస్తుతం అత్యధిక మందిని ఆకట్టుకునే పవర్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనికేషన్ వేదికగా ఉంటోంది. ఫేస్ బుక్, ఇన్‌స్టా, ఎక్స్, థ్రెడ్, ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిలో లేదా మల్టిపుల్ వేదికల్లో తమ ఖాతాలను కలిగి ఉంటున్నారు. ఎంత బిజీ వర్కులో ఉన్నా మధ్య మధ్యలో వాటిని స్క్రోల్ చేయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవారు చాలా మందే ఉంటారు. ఇలాంటి సిచువేషన్స్ క్రమంగా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడుపుతుండటంవల్ల కొందరిలో మెడనొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ‘నేచర్ హ్యూమన్ బిహేవియరల్‌’లో పబ్లిషైన ఓ స్టడీ ప్రకారం మాత్రం, తక్కువ సామాజిక అవగాహన కలిగిన వ్యక్తుల్లో సోషల్ మీడియా అతి వినియోగం, వారి మెంటల్ హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతోంది. అధ్యయనంలో భాగంగా 1000 మందిని రీసెర్చర్స్ అబ్జర్వ్ చేశారు. వారి ఆన్‌లైన్ బ్రౌజింగ్ అలవాట్లను ఎనలైజ్ చేశారు. కాగా వీరంతా సోషల్ మీడియాలో మంచి కంటెంట్ కంటే కూడా నెగెటివ్ కంటెంట్‌కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని గుర్తించారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో ఎక్కువగా నిమగ్నమయ్యేవారు బయటి పరిస్థితుల్లో నిజమైన సామాజిక సంబంధాలకు దూరం అవుతున్నారు. అంతేకాకుండా రాత్రింబవళ్లు ఎక్కువగా నెగెటివ్ కంటెంట్‌ను చూడటం, చదవడం కారణంగా కొందరిలో ప్రతికూల భావోద్వేగాలు డెవలప్ అవుతున్నాయని పబ్ మెడ్ జర్నల్ నివేదిక సైతం పేర్కొంటున్నది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగడంవల్ల జ్ఞాపక శక్తి తగ్గుదలకు దారితీస్తోందని, పలువురు స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా రీసెర్చర్స్ అంటున్నారు. సో.. సోషల్ మీడియా అవసరమే కావచ్చు. కానీ దానికంటూ ఓ లిమిట్ కూడా ఉండాలంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed