- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Tummala : సమన్వయంతో రైతు పండుగను విజయవంతం చేయాలి : మంత్రి తుమ్మల
దిశ, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర్ లో ఈనెల 28,29,30 తేదీల్లో నిర్వహించే రైతు పండుగ(Farmers' Festival) సదస్సు విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)సూచించారు. సూచించారు. రైతు పండుగ సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao), దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha)లతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుండి 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు.
రెండోరోజైన 29న మహబూబ్ నగర్ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్షమంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాథలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతు, వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు .