Smart Meters: స్మార్ట్ విద్యుత్ రీచార్జ్ మీటర్లు వచ్చేశాయ్..

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-11-26 11:58:05.0  )
Smart Meters: స్మార్ట్ విద్యుత్ రీచార్జ్ మీటర్లు వచ్చేశాయ్..
X

దిశ, కారంపూడి : చంద్రబాబు నాయుడి ప్రభుత్వం స్మార్ట్ పాలనవైపు అడుగులు వేస్తోంది. వృథాను తగ్గించడం, నాణ్యమైన సేవలను అందించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగిస్తోంది. ప్రిపేయిడ్ మీటర్లుగా పని చేసే వీటి ద్వారా విద్యుత్ ఆదా కావడంతోపాటు విద్యుత్ చౌర్యం పూర్తిగా ఫులిస్టాప్ పడుతుంది. అంతేకాదు బిల్లులు బకాయిలు పడకుండా ఉంటుంది. మొబైల్‌కు రీచార్జ్ చేసిన విధంగానే ఈ స్మార్ట్ విద్యుత్ మీటర్లను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీచార్జ్ చేసిన డబ్బులు అయిపోగానే విద్యుత్ ఆగిపోతుంది.

కారంపూడిలోకి స్మార్ట్ మీటర్లు ఎంట్రీ

ఈ స్మార్ట్ విద్యుత్ మీటర్లను ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలకు బిగిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పాత మీటర్లను తొలగించి వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రీడింగు తీసే వ్యక్తి మీటర్ల వద్దకు వచ్చి ప్రింటెండ్ బిల్లు ఇచ్చేవారు. ఒక్కో నెల ఆలస్యంగా రీడింగ్ నమోదు చేయడంతో బిల్లు ఎక్కువగా రావడం, యజమాని ఇంట్లో లేకపోవడంతో సకాలంలో బిల్లు అందకపోవడం వంటి సమస్యలు వచ్చేవి. ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా విద్యుత్తు చౌర్యం అరికట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు పేరుకు పోకుండా ఉండేందుకు ప్రతి నెల బిల్ కట్టవచ్చని అధికారులు తెలిపారు.

బకాయిల భారం, విద్యుత్ చౌర్యం తగ్గుతుంది..

తొలి దశలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు వీటిని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో గృహాలకు, వ్యాపారస్తులకు కూడా ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ మీటర్లతో విద్యుత్తు శాఖకు బకాయిల భారం తగ్గుతుంది. నాణ్యమైన విద్యుత్తుకు ఇది తోడ్పడుతుంది. దీని వలన కరెంట్ బిల్ చెల్లించని వియోగదారుని విద్యుత్‌ను సర్వీస్ వైర్ కట్ చేయకుండా సర్వీస్ నెంబర్ ఆధారంగా విద్యుత్ కట్ చేయచ్చు. దీని వల్ల అదనపు చార్జీలు, పెనాల్టీ చార్జీలు ఉండకుండా డబ్బు ఆదా అవుతుంది.

విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు..

ఇప్పటి వరకు కారం పూడి పట్టణ మండల పరిధిలో సుమారుగా 200 స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశాము. ముందుగా గవర్నమెంట్ ఆఫీస్ లలో ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత వినియోగ దారులకు పార్ట్- 1, పార్ట్ -2, వినియోగదారులకు వ్యాపారస్తులకు ఏర్పాటు చేస్తాం . నాణ్యమైన విద్యుత్తు అందుతుంది. ఎప్పటికప్పుడు మీటర్లు రీడింగ్ తో పాటు బిల్లు ఎంతయ్యిందో తెలుసుకో వచ్చు. భవిష్యత్తులో మీటర్లను ప్రీపెయిడ్గా ఉపయోగించేందుకు అవకాశం ఉంది. వినియోగదారుడు విద్యుత్తు వృథా కాకుండా విని యోగంపై స్వీయ నియంత్రణ చేసుకునే వీలుంది. చరవాణి ద్వారా వాటి వివరాలు తెలుసుకోవచ్చు.

-గొళ్లపూడి రామాంజనేయులు, విద్యుత్ ఏఈ, కారంపూడి

Advertisement

Next Story

Most Viewed