MLA Yennam: మా పాలనే మెరుగు..వస్తే నిరూపిస్తాం : కేటీఆర్ కు ఎమ్మెల్యే యెన్నం సవాల్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-26 10:44:12.0  )
MLA Yennam: మా పాలనే మెరుగు..వస్తే నిరూపిస్తాం : కేటీఆర్ కు ఎమ్మెల్యే యెన్నం సవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్(BRS) పాలన కంటే మా కాంగ్రెస్(CONGRESS) పాలన అన్ని రంగాల్లో మెరుగని, కేటీఆర్ చర్చకు వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) సవాల్ చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనేదో ప్రజలకు ప్రతిపక్ష నేతగా చెప్పుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం సీఎం రేవంత్ రెడ్డిపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన అకాకులు, చవాకులు పేలుతున్నాడని విమర్శించారు. బీఆరెఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ విదేశీ పర్యటనల సందర్బంగా ఒకటో రెండో ఎంవోయూలు జరిగినట్లుగా ప్రచారం చేసుకునేవారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పారిశ్రామిక రంగ పెట్టుబడులపై వారానికి రెండూ మూడు కంపెనీలు ఎంవోయూలు జరుగుతున్నయని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం క్రిమినల్ మైండ్ తో కుట్రలు చేస్తోందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నాడన్నారు. అందుకు ఆయనను అభినందించాల్సింది పోయి ఇదే కొడంగల్ లో ఒక విషబీజాన్ని నాటి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని విమర్శించారు.

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలపైన, పెట్టబడులపైన, పథకాలపైన బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిపారు. ఎన్నికల హామీల్లో రైతు రుణమాఫీ చేశామని, పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకొని, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, ఆడబిడ్డలకు 3541 కోట్ల రూపాయలను ఆదా చేశామన్నారు. ఆరు గ్యారంటీల్లో రూ.500సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500బోనస్ అమలవుతున్న సంగతి మరువరాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed