- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ప్రధాని మోడీని కలుస్తా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ (Deputy CM Pawan Kalyan) ఢిల్లీ పర్యటనలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. వివిధ వ్యవహారాలపై చర్చించిన ఆయన.. గత ప్రభుత్వ చేసిన తప్పిదాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. గత వైసీపీ(YCP) ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ నిధులు వాడలేదుదని గుర్తు చేశారు. అలాగే జల్‌జీవన్ బడ్జెట్(Jaljeevan Budget) పెంచాలని కేంద్రాన్ని కోరానని, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో..నిధులు వినియోగించలేదని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ చేసిన ఆ తప్పిదాలను రాష్ట్రం ఇప్పుడు అనుభవిస్తుందని గుర్తు చేశారు. అలాగే రేపు ప్రధాని మోడీ (Prime Minister Modi)ని కలుస్తానని, అదానీ వ్యవహారం(Adani issue)పై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో సమోసాల కోసం రూ. 9కోట్లు ఖర్చు చేశారని, హోంశాఖ, లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేదని మరో సారి గుర్తు చేశారు.