- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Disaster relief : కర్ణాటక సహా 15 రాష్ట్రాలకు రూ.1,115 కోట్లు.. విపత్తు సహాయ నిధికి కేంద్రం ఆమోదం
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సహా 15 రాష్ట్రాల్లో విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గాను రూ.1,115 కోట్లు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అమిత్ షా (Amith shah) నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు 139 కోట్లు, మహారాష్ట్రకు రూ.100 కోట్లు, కర్ణాటక, కేరళలకు రూ.72 కోట్లు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు రూ.50 కోట్లు, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలకు పరిహారంగా 378 కోట్లు అందజేయనున్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి (NDMF) నుంచి నిధుల కోసం 15 రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక, వ్యవసాయ మంత్రి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌తో కూడిన కమిటీ పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే రెండు ప్రతిపాదనలు చేయగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ నిధులతో అన్ని రాష్ట్రాల్లో డిఫెన్స్ వాలంటీర్ల శిక్షణా సామర్థ్యాలను పెంపొందించడం, ఇతర చర్యలు చేపట్టనున్నారు. అంతకుముందు కమిటీ మొత్తం రూ.3075.65 కోట్లతో ఏడు నగరాల్లో అర్బన్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్‌లను, నాలుగు రాష్ట్రాల్లో గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ (జిఎల్‌ఓఎఫ్) రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను ఎన్‌డీఎంఎఫ్ నుంచి మొత్తం రూ.150 కోట్లతో ఆమోదించింది. దేశంలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందిని హోం మంత్రిత్వా శాఖ తెలిపింది. కాగా, ఇటీవల అనేక రాష్ట్రాల్లో భారీగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విపత్తులను దీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.