- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాన్సీ నెంబర్లకు భారీ క్రేజ్.. ఒక్కరోజులోనే రవాణా శాఖకు భారీ ఆదాయం
దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్యాన్సీ నెంబర్ల(fancy number)కు వాహనదారులు మొగ్గు చూపుతుండటంతో.. రవాణాశాఖ(Transport Department)కు కాసుల వర్షం కురిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్ లైన్‌లో బిడ్డింగ్ వేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీఏ(RTA) పరిధిలోని సెంట్రల్ జోన్ ఖైరతాబాద్(Khairatabad) పరిధిలో మంగళవారం ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్(Bidding of fancy numbers)ను ఆన్ లైన్(Online)లో నిర్వహించారు. మొత్తం 9 నెంబర్లకు 52,52,283 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు.
ఇందులో TG 09 D 0001 నెంబర్ కు రూ. 11,11,111 లకు అమ్ముడు పోయి రికార్డులో నిలిచింది. అలాగే TG 09 D 0009 నెంబర్ కు 10,40,000, TG 09 C 9999 నెంబర్ కు 7,19,999, TG 09 D 0006 నెంబర్ కు రూ.3,65,000, TG 09 D 0005 నెంబర్ కు రూ. 3,45,000, TG 09 D 0007 నెంబర్ కు 2,06,569లు, TG 09 D 0019 నెంబర్ కు 1,95,009, TG 09 D 0099 నెంబర్ కు 1,85,000లు, TG 09 D 0077 నెంబర్ కు రూ.1,17,789 వచ్చినట్లు జేటీసీ తెలిపారు.