రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా చదవాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

by Aamani |
రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్‌ను  ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా చదవాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ,నిజాంసాగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదివి మంచి స్థాయిలో నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆయన మంగళవారం నిజాంసాగర్ మండలంలోని నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతత్ర్యం వచ్చిన తర్వాత దేశ పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాంగం నిర్మాణం చేపట్టేందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సారధ్యంలో రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించినట్లు పేర్కొన్నారు.

అందుకే భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ నుండే మంచి లక్ష్య సాదన కొరకు కష్టపడి చదవాలని కోరారు. అదేవిధంగా చదువుతో పాటు క్రీడా రంగంలో సైతం రాణించాలని అన్నారు. నవోదయ విద్యాలయంలో పూర్తి స్థాయిలో ఉన్నతమైన ఉపాధ్యాయ బృందం ఉన్నారని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ సత్యవతి మాట్లాడుతూ..విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలను తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కస్టపడి చదివిన తీరును వివరించారు. అవకాశాలను సద్వినియోగించుకుని మంచి చదువులు చదవాలని కోరారు.

తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సత్యవతి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మను జే యోహాన్, ప్రవీణ్ కుమార్,జోజి బాబు,కృష్ణ రెడ్డి,రవి నాయక్,వివేక నంద నాయుడు,కృష్ణం రాజు,అమృత,అన్నపూర్ణ, శీతల్ మావి,సరిత కుస్వహ,వరలక్ష్మి,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సర్వే డేటా ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రి త్వరగా పూర్తి చేయాలనీ ఎంపిడిఓ గంగాధర్ ను ఆదేశించారు. ఆయన సమగ్ర సర్వే ఆన్ లైన్ ప్రక్రియను పరిశీలించారు. సర్వే పూర్తి అయిన తర్వాత డాటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనదని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎంట్రీ పూర్తి చేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ చేసిన డేటా ఎంట్రీ వివరాలను తహసిల్దార్ బిక్షపతి ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వలస కార్మికుల కుటుంబ సభ్యుల వివరాలను సైతం సేకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని బంజపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి,ఎంపీడీఓ గంగాధర్, డీపీఓ శ్రీనివాస్ రావు,మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీపతి,ఎంపీఓ అనిత,గ్రామ పంచాయతీ కార్యదర్శి భీం రావు,రవి రాథోడ్,తుకారాం,బి.భారతి, అంజయ్య,రమేష్,ఏ. భారతి,కారోబార్ సాయిలు, షాదుల్,చాకలి మల్లేష్,ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed