పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి ఆత్మహత్య

by Sridhar Babu |
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి ఆత్మహత్య
X

దిశ, కోరుట్ల : తల్లిదండ్రులు చేసే పెళ్లి సంబంధాలు ఇష్టం లేక ఉరేసుకుని యువతి చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన పుప్పాల చిన్నయ్య కూతురు రమ్య(19) అనే యువతికి గత కొన్ని రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారు. రమ్య అందుకు నిరాకరించి మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని చనిపోయింది. మృతురాలి తండ్రి చిన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story