- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రబీకి నీటి సౌకర్యం చూసి పంటలు వేయాలి : బోధన్ ఎమ్మెల్యే
దిశ, నవీపేట్ : రూ.500 బోనస్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కి రైతులు ధన్యవాదాలు తెలపాలని, సీఎం రేవంత్ రెడ్డి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంతో పాటుగా 500 బోనస్ అందించారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలం లో మంగళవారం నాడు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 10 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. హాస్పిటల్ ని తనిఖీ చేశారు. వైద్యం ఇస్తున్న తీరును పరిశీలించారు. రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్లను ఎవరైనా అడ్డుకుని బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
నూతనంగా నిర్మించిన శివ పంచాయతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. తదనంతరం మొకన్ పల్లి కస్తూర్బా గాంధీ స్కూల్ లో 85 లక్షలతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వీటితో పాటు హామీ మేరకు రూ.500 బోనస్ అందించామని తెలిపారు.
బోనస్ ఇచ్చిన సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. కస్తూర్బా గాంధి స్కూల్ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితం లో స్థిరపడాలని, విద్యార్థుల కొరకు నిధులు మంజూరు చేయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్స్ లను చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఎంపీడీఓ నాగనాథ్, తహశీల్దార్ వెంకట రమణ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాయ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజేంద్ర కుమార్ గౌడ్, గోపాల్, భగవాన్, సంజీవ్ రెడ్డి,బాల్ రాజ్ గౌడ్, మోహన్, జాకీ తదితరులు పాల్గొన్నారు.