బాలకృష్ణతో వన్స్‌మోర్‌.. అన్‌స్టాపబుల్‌ షోకు డ్యాన్సింగ్ క్వీన్ (ట్వీట్)

by Hamsa |
బాలకృష్ణతో వన్స్‌మోర్‌.. అన్‌స్టాపబుల్‌ షోకు డ్యాన్సింగ్ క్వీన్ (ట్వీట్)
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’(Unstoppable with NBK) షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోగా..ప్రజెంట్ నాలుగో సీజన్ నడుస్తోంది. ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం అయి ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. అయితే దీనిని రెండు భాగాలుగా విడుదల చేయగా భారీ వ్యూస్ రాబట్టింది. దీంతో ఆరో ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో.. తాజాగా, అన్‌స్టాపబుల్ షోలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela ) పాల్గొనబోతున్నట్లు ‘ఆహా’ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)కు శ్రీలీల వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. ఇందులో శ్రీలీల స్లీవ్‌లెస్ జాకెట్, ఎరుపు నలుపు కలిసిన చీరతో కనిపించింది. దీంతో ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శ్రీలీలతో పాటు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కూడా రాబోతున్నట్లు సమాచారం.

కానీ వీరిద్దరు ఒకే ఎపిసోడ్‌లో క‌నిపించ‌నున్నారా? లేదంటే వేరువేరు ఎపిసోడ్‌లో క‌నిపించ‌నున్నారా ? అనేది తెలియాల్సి ఉంది. కాగా, బాలకృష్ణ, శ్రీలీల కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’(Bhagavanth Kesari) బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరు ఓకే స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారని తెలుసుకున్న ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Advertisement

Next Story