- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చందానగర్ విష్ణు పారమిత ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలుడి మృతి

దిశ, శేరిలింగంపల్లి : ఇంజెక్షన్ వికటించి నాలుగేళ్ళ బాలుడు మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పిటల్ లో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రపురం లో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ కు వాంతులు కావడంతో ఆదివారం మధ్యాహ్నం చందానగర్ లోని విష్ణు పారమిత ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ బాలుడిని చెక్ చేసిన డ్యూటీ డాక్టర్ మెడిసిన్ రాసి ఇచ్చాడు. అయితే బాలుడి తండ్రి మెడికల్ షాప్ నుండి ఇంజెక్షన్ తీసుకువచ్చే లోపే డ్యూటీలో ఉన్న నర్స్ బాలుడికి ఇంజక్షన్ చేసినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
నర్సులు తనకు తోచిన ఇంజెక్షన్ చేయడం వల్లనే చిన్నారి జాన్సన్ మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తూ హైదరాబాద్, ముంబై నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. చందానగర్ సీఐ పాలవెల్లి, ఎస్సై ఆంజనేయులు, పోలీసు సిబ్బంది వారికి నచ్చచెప్పినా రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే విషయంపై విష్ణు పారమిత ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా.. గత వారం రోజులుగా బాలుడు వాంతులతో బాధపడుతున్నాడని, ఇది వరకు వేరే ఆస్పత్రిలో చూపించారని, అక్కడ తగ్గక పోవడంతో మా ఆస్పత్రికి వచ్చారని, అప్పటికే బాబు పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. మెడిసిన్ రాశామని బాలుడి తండ్రి మందులు తీసుకువచ్చే లోపే చిన్నారి మృతి చెందాడని, తాము ఎలాంటి వైద్యం ప్రారంభించలేదని విష్ణు పారమిత డాక్టర్లు తెలిపారు.