- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగం దేశానికి ఆత్మ లాంటిది
దిశ,గుడిహత్నూర్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ మస్కే మాధవ్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది అన్నారు.
రాజ్యాంగానికి 1949 నవంబర్ 26 రోజున తుది ఆమోదం లభించిందని, అందుకే ఈ రోజును రాజ్యాంగం దినోత్సవంగా పిలుస్తారని తెలిపారు. భారత రాజ్యాంగం కేవలం చట్టాల సముదాయం కాదని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం సూత్రాలను పొందుపరిచే పత్రమని భారతీయ బౌద్ధ మహాసభ మండల అధ్యక్షులు కిషన్ బుద్ధే అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారత పౌరుడు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కె. మహేందర్, ససానే సిద్ధార్థ్, గోవింద్ బుద్ధే, మాధవ్ ససానే, తురేవాల్, శంకర్,బుద్ధే బబన్,రాజు, కుశాల్, ఆడే సునిల్, బడుగు రాజేశ్వర్ పాల్గొన్నారు.