- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shashikant Ruia: ఎస్సార్ గ్రూప్ కో-ఫౌండర్ శశికాంత్ రుయా కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్సార్ గ్రూప్(ESSAR Group) సహా వ్యవస్థాపకులు(Co-Founder) శశికాంత్ రుయా(Shashikant Ruia) మంగళవారం కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్సార్ కుటుంబానికి మార్గదర్శకుడైన శశికాంత్ రుయా గారి మరణవార్తను ఎంతో దిగ్భ్రాంతితో తెలియజేస్తున్నాము. ఆయన వృద్ధాప్య కారణాలతో(Due To Old Age) 81 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితకాలంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు' అని తెలిపింది.
ఈ రోజు సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం రుయా అంత్యక్రియలు నిర్వహించనునన్నారు. కుటుంబసభ్యుడిని కోల్పోయిన రుయా ఫ్యామిలీకి వ్యాపార, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రుయా మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శశికాంత్ రుయా 1943లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్(Mechanical Engineering)లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 1969లో తన సోదరుడు రవి రుయా(Ravi Ruia)తో కలిసి ఎస్సార్ సంస్థను స్థాపించారు. వీరిద్దరూ 2012 ఫోర్బ్స్ జాబితా(Forbes list)లో చోటు దక్కించుకున్నారు. ఇంధనం, విద్యుత్, కార్గో, కోల్ మైనింగ్, షిప్పింగ్, ఐటీ, స్టీల్ వంటి రంగాల్లో ఎస్సార్ సంస్థకు వ్యాపారాలు ఉన్నాయి.