Bandi: ఉగ్రవాదం నాగరికతకు మచ్చ.. 26/11 దాడుల్లో అమరులకు బండి సంజయ్ నివాళులు

by Ramesh Goud |
Bandi: ఉగ్రవాదం నాగరికతకు మచ్చ.. 26/11 దాడుల్లో అమరులకు బండి సంజయ్ నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదం(Terrorism) నాగరికతకు మచ్చ అని, జాతీయ భద్రత(National Security)పై రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) స్పష్టం చేశారు. 26/11 ముంబై దాడులపై(Mumbai Attacks) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రాణాలు అర్పించిన జావాన్లకు నివాళులు(Tribute) అర్పించారు. దీనిపై ఆయన.. 26/11న ముంబైలో జరిగిన పిరికిపంద ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా, ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన భద్రతా సిబ్బందికి సెల్యూట్(Salute) చేయడంలో మరియు అమాయక బాధితులకు హృదయపూర్వక నివాళులర్పించడంలో నేను దేశంతో కలిసి ఉన్నానని తెలియజేశారు. అలాగే ఉగ్రవాదం మానవ నాగరికతకు మచ్చ అని నినదించారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నాయకత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన 'జీరో టాలరెన్స్' విధానం(Zero Tolerance Policy), భారత్ విపత్తుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రపంచ నాయకుడిగా ఉద్భవించిందని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ భద్రతపై ఎటువంటి రాజీ లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed