- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Attacked : గుల్లకోట లో దారి తప్పిన గురువు…విద్యార్థి పై టెస్టర్ తో దాడి
దిశ, వెల్గటూర్ : గుల్లకోట లో ఓ గురువు దారి తప్పాడు. బడికి వచ్చే పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి బావి భారత పౌరులుగా తీర్చి దిద్దే గురువు ఓ పిల్లాడు చేసిన చిన్న తప్పును మన్నించి దారిలో పెట్టాల్సింది పోయి క్షణికావేశానికి లోనై టెస్టర్ తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్గటూర్ మండలంలోని గుల్ల కోట జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అభినయ్ అనే విద్యార్థిని శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు బుధవారం క్షణికావేశంలో టెస్టర్ తో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడిన విద్యార్ధి ధర్మారం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
కాగా గ్రామానికి చెందిన అభినయ్ అనే విద్యార్థి క్లాస్ కు ఆలస్యంగా వచ్చి తిరిగి ఎలాంటి అనుమతి లేకుండా పాఠం జరుగుతున్న మధ్యలో తరగతి గది నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆలస్యంగా రావడం అనుమతి లేకుండా క్లాస్ జరుగుతుండగా బయటకు వెలుతున్నందువల్ల ఆవేశానికి లోనైన ఉపాధ్యాయుడు టెస్టర్ ను అభినయ్ పైకి విసిరి కొట్టాడు. అతడు విసిరిన టెస్టర్ విద్యార్థి రిభ్స్ కు మధ్యలో బలంగా తగిలి గాయం అయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆగ్రహానికి లోనైన విద్యార్థి తండ్రి ఎలుక సురేష్ తన బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించి పిటిషన్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే టీచర్ కెరియర్ దెబ్బతింటుంది అనే కారణంగా కొంత మంది మధ్య వర్తులు రాయబారం కుదుర్చగా విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్ కు సయోధ్య కుదిరి వివాదం సద్దు మనిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విద్యార్థి తల్లిదండ్రులు పోలీసుల నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన పట్ల ఎస్సై ఉమాసాగర్ ను వివరణ కోరగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి పిటిషన్ ఇవ్వలేదని తెలిపారు. ఇదే ఘటనపై హెచ్ ఎం రామచంద్రం ను వివరణ కోరగా విద్యార్థి పై టీచర్ కు ఎలాంటి దురుద్దేశం లేదు. ఆయన చాలా మంచివారు. క్షణికావేశంలో అది జరిగిపోయింది.