- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Kasireddy Narayana Reddy: మైసిగండి దేవాలయ అభివృద్ధికి కృషి
దిశ,ఆమనగల్లు: మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (MLA Kasireddy Narayana Reddy )అన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా.. గురువారము ఆయన కడ్తాల్ మండలం మైసిగండిలో పర్యటించారు.మైసమ్మ దేవాలయ అర్చకులు, నిర్వాహకులు ఎమ్మెల్యే నారాయణరెడ్డి కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్ట్ శిరోలి పంతుతో కలిసి ఎమ్మెల్యే నారాయణరెడ్డి మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ నిర్వాహకులు సత్కరించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకముందు పురేనాగిరి కొండపై వెలసిన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, తహసిల్దార్ జ్యోతి,జిల్లా నాయకులు గూడూరు భాస్కర్ రెడ్డి,నాయకులు శేఖర్, హీరాసింగ్, తులసిరామ్,చందోజీ,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.