Hash oil extraction : భారీగా హష్ ఆయిల్ పట్టివేత

by Naveena |
Hash oil extraction : భారీగా హష్ ఆయిల్ పట్టివేత
X

దిశ ,శంషాబాద్,గండిపేట : గుట్టు చప్పుడు కాకుండా యాష్ ఆయిల్ విక్రయిస్తున్న లేడి కిలాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. యాష్ ఆయిల్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబట్ట ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ పిఎన్ టీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడలో యాష్ ఆయిల్ విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో.. రాజేంద్రనగర్ పోలీసులు గురువారం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్టి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో యాష్ ఆయిల్ విక్రయిస్తున్న రహీం ఉన్నిసా అనే మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద ఉన్న 231 గ్రాముల (60) బాటిల్స్ యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద నుంచి 35,500 నగదుతో పాటు.. ఒక సెల్ ఫోన్ సీజ్ చేశారు. రహీం ఉన్నిసా అరెస్టు చేసి ఎన్డి పీఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story