Paddy : అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం

by Kalyani |
Paddy : అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం
X

దిశ,దుబ్బాక : దుబ్బాక మండలంలో గురువారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్ల ధాన్యం తడిసింది. ఆరుగాల కష్టాన్ని కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. దుబ్బాక మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకపోయింది. కళ్లెదుటే ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకపోవడంతో రైతులు చేసేదేమిలేక లబోదిబోమన్నారు. కొంతమంది రైతులు ముందస్తుగా అప్రమత్తమై టార్పాలిన్ కవర్లను ధాన్యంపై కప్పి కాపాడుకోగా మరికొంత మంది రైతులు సమయానికి ధాన్యం రాశుల వద్దకు చేరుకోకపోవడంతో వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story