North Korea : వామ్మో.. నార్త్ కొరియా చేతికి చేరిన మరో ప్రమాదకరమైన ఆయుధం..! ఏంటది..?

by Maddikunta Saikiran |
North Korea : వామ్మో.. నార్త్ కొరియా చేతికి చేరిన మరో ప్రమాదకరమైన ఆయుధం..! ఏంటది..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ గుర్తొస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అగ్రనేతల్లో కిమ్‌ జోంగ్ ఉన్‌ ఒకరు.ఇప్పటికే ఉత్తర కొరియా అమ్ములపొదిలో చాలా ప్రమాదకరమైన ఆయుధాలున్నాయి. తాజాగా మరో ప్రమాదకరమైన ఆయుధం నార్త్ కొరియా అమ్ములపొదిలోకి వచ్చి చేరింది.కొత్త‌గా సూసైడ్ డ్రోన్ల‌(suicide drones)ను నార్త్ కొరియా తయారు చేస్తున్నది.ఆదివారం ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు.తమ దేశ మిలిటరీని బలోపేతం చేయడానికి ఈ డ్రోన్స్‌ ఆయధాలను తయారు చేస్తున్నట్లు అధ్యక్షుడు కిమ్‌ తెలిపారు. సూసైడ్ డ్రోన్ల‌ సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా మీడియా ఓ వీడియోను విడుదల చేసింది.ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది.

సూసైడ్ డ్రోన్లు ఎలా పనిచేస్తాయంటే..?

ఆదివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న డ్రోన్‌లు ప్రదర్శించారు. ఈ డ్రోన్‌ను ఎక్స్‌ షేప్‌లో ఉండే రెక్కలతో రూపొందించారు.మిగతా డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. అయితే, ఈ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతుంది. తద్వారా అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్లతో ఛేదించవచ్చని, సాధ్యమైనంత త్వరగా ఈ డ్రోన్‌లను తమ మిలిటరీలో చేర్చనున్నట్లు కిమ్ తెలిపారు. ఉక్రెయిన్‌, రష్యా వివాదం అంతర్జాతీయ దృష్టిని మళ్లించడంతో, కిమ్ తన యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించిన తరుణంలో కిమ్ దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని ఆయుధాగారాన్ని విస్తరిస్తున్నారు. మరి కిమ్‌ చేపట్టిన ఈ చర్యపై అమెరికాతో పాటు దక్షిణ కొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story