హైదరాబాద్ జట్టుకు భారీ నజరానా ప్రకటించిన హెచ్‌సీఏ

by Harish |
హైదరాబాద్ జట్టుకు భారీ నజరానా ప్రకటించిన హెచ్‌సీఏ
X

దిశ, ఉప్పల్ : ఆల్ ఇండియా బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టును శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు రూ. 25 లక్షల క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించారు. జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని టోర్నీల్లో హైదరాబాద్ జట్టు విజయాలు సాధించాలని, రంజీ టోర్నీలో రాణించాలని ఆకాక్షించారు. ప్రతి ఐపీఎల్‌కి హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి క్రికెటర్లు ఎంపికయ్యేలా హెచ్‌సీఏ కృషి చేస్తుందన్నారు. హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్, భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఆటగాళ్లకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లతోపాటు హెచ్‌సీఏ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed