డీ పోచంపల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు.. అధికారులపై తీవ్ర విమర్శలు

by srinivas |
డీ పోచంపల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు.. అధికారులపై తీవ్ర విమర్శలు
X

దిశ, దుండిగల్: ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తుండడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. దుండిగల్ మండల పరిధిలోని డీ పోచంపల్లి సర్వే నెం. 120లో జోరుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. సంబంధిత కబ్జాలపై రెవెన్యూ అధికారులను వివరణ కోరితే కబ్జాదారుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండడం రెవెన్యూ అధికారుల తీరుకు అద్దం పడుతోంది. మండలంలో కాసులకు కక్కుర్తి పడుతున్న రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు లీకు వీరులుగా మారారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను అరికట్టేందుకు 59 జీవోపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఆదేశాలున్నా దుండిగల్ మండలంలో 59 జీవో పేరుతో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. కాపాడాల్సిన వారే కాటేసున్నట్లుంది రెవెన్యూ అధికారుల తీరు ఉంది. రెవెన్యూ అధికారులను వివరణ కోరిన నిమిషాల్లో కబ్జాదారుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే రెవెన్యూ అధికారుల తీరు ఏపాటిదో అర్థం అవుతుంది. నిఘా పెంచి కబ్జాల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని డిమాండ్ వినిపిస్తుంది.

కబ్జాదారులకు అధికారుల పరోక్ష సహకారం

కాపాడాల్సిన వాడే కాటేస్తున్నట్లుంది రెవెన్యూ అధికారుల తీరు, కబ్జాల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతూ కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తుండడంతో మండల పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సింది పోయి కబ్జాలపై అధికారులను వివరణ కోరితే సంబంధిత అధికారులు కబ్జాదారులకు సమాచారం చేరవేస్తూ లీకువీరులుగా మారారు. మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలా లను కాపాడేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేతివాటంతో ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నా యి. సంబంధిత ఆర్ఐ అండ తోనే ఇటీవల అక్రమ నిర్మాణా లు జోరుగా సాగుతున్నాయం టూ విమర్శలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed