అమెరికాలో వరంగల్ వాసి అనుమానాస్పద మృతి..

by Sumithra |   ( Updated:2024-12-23 05:08:55.0  )
అమెరికాలో వరంగల్ వాసి అనుమానాస్పద మృతి..
X

దిశ, కమలపురం : మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశి అమెరికాలోని మినేయిసోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ సంవత్సరం క్రితం అమెరికాకు పై చదువుల నిమిత్తం వెళ్ళాడు. ఎంతో శ్రమపడి, తల్లిదండ్రులు శ్రమకోర్చి పైసా పైసా కూడబెట్టి అతడిని అమెరికా పంపించారు.

కాని అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి వంశీ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మృతి పైన పూర్తి స్థాయి విచారణ జరిపి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed