- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Inter Caste Incentive Scheme: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి ప్రభుత్వం రూ. 2.50లక్షల ఆర్థిక సాయం.. అప్లై చేసుకోండిలా..!
X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(TG Govt) కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి 'ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్(Intercaste Incentive Scheme)'ను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ. 2.50లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. పెళ్లైన వధూవరులు తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పథకానికి అర్హతలు ఏంటి? అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు:
- వధూవరులు తెలంగాణ వాసులై ఉండాలి.
- అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు పూర్తై ఉండాలి.
- వధూవరులలో ఒకరు కచ్చితంగా షెడ్యూల్డ్ కులానికి(SC) చెందిన వారై ఉండాలి.
- అమ్మాయి/అబ్బాయి తొలి వివాహానికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది.
- పెళ్లైన ఏడాది లోపే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి.
- 2019, అక్టోబర్ 30 తర్వాత కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రమే రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్..
- అమ్మాయి, అబ్బాయి ఆధార్ కార్డు అలాగే జాయింట్ బ్యాంక్ అకౌంట్
- వధూవరుల క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్స్
- మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మ్యారేజ్ ఫోటోస్
- పర్మినెంట్&టెంపరరీ అడ్రస్ ప్రూఫ్
- పాస్ పోర్ట్ సైజు ఫోటోస్, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డ్లు
Advertisement
Next Story