మోడీకి నోబెల్ శాంతి బహుమతి..? ఈ ఏడాదిలో ప్రకటించనున్న కమిటీ!

by Harish |   ( Updated:2023-03-15 17:17:30.0  )
మోడీకి నోబెల్ శాంతి బహుమతి..? ఈ ఏడాదిలో ప్రకటించనున్న కమిటీ!
X

న్యూఢిల్లీ: ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది భారత ప్రధాని మోడీని వరించనుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే తోజే ప్రకటన ఇందుకు కారణమైంది. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోడీయే అతిపెద్ద పోటీదారు అని అన్నారు. ప్రపంచంలో శాంతికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి ప్రధాని మోడీ అని, ఆయన పనితీరుకు అభిమానిని అయిపోయాయని ప్రశంసించారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పగల సమర్థత ఆయనకే ఉందని కొనియాడారు. మోడీ విధానాలతో భారత్ ధనిక, శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి అత్యంత అర్హత కలిగిన నేత ప్రధాని మోడీయేనని వెల్లడించారు. ప్రపంచ నాయకులు మోడీలా ఉండాలని సలహా ఇచ్చారు.

కాగా, అస్లే ఎప్పుడు, ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశారనేదిపై మాత్రం స్పష్టత లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో నోబెల్ అవార్డు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాని మోడీకి శాంతి బహుమతి ప్రకటిస్తే, వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ బూస్ట్ అందుతుందనడంలో సందేహం లేదు.

Advertisement

Next Story