New Jersey : రాడార్ లో తలెత్తిన సమస్య.. పలు విమానాలు రద్దు.. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-04 00:43:18.0  )
New Jersey : రాడార్ లో తలెత్తిన సమస్య.. పలు విమానాలు రద్దు.. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా దేశం న్యూజెర్సీ(New Jersey) రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (Newark Liberty International Airport) సోమవారం మధ్యాహ్నం రాడార్ లో సమస్య తలెత్తింది. ఈ కారణంగా 456 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 64 విమానాలను అధికారులు రద్దు చేశారు.దీంతో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపిన వివరాల ప్రకారం న్యూజెర్సీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2:30 గంటలకు "రాడార్ సమస్య" తలెత్తింది. ఈ కారణంగా పలు విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను రద్దు చేశారు.అలాగే మరి కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు ఏవియేషన్ అధికారులు మళ్లించారు.

కాగా ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్య కారణంగా తన భర్తతో పాటు విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ట్రావెలర్ కారీ జెఫ్నర్ తన కష్టాలను వివరించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడూతూ.. మేము విమానం ఎక్కినాక నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో రాడార్ లో సమస్య ఉందని ఏవియేషన్ అధికారులు చెప్పారు. దీంతో మేము విమానం నుంచి కిందకి దిగాము. అరగంట వేచి ఉండమని చివరికి 7:30కి ఫ్లైట్ రద్దు చేశారు. దీంతో మేము ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సివచ్చిందని ఆమె వాపోయింది.అలాగే మరోక ప్రయాణికుడు మాట్లాడూతూ..రాడార్ లో ఏర్పడిన అంతరాయం వల్ల తన కుమార్తె హనీమూన్‌ను క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.కాగా సోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా అమెరికాలో అన్ని ఎయిర్ పోర్టుల్లో అత్యంత రద్దీ ఏర్పడింది. విమానాలను రద్దు చేయడంతో చాలా మంది ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed