Israel-Hamas war: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ కీలక ప్రకటన

by Shamantha N |
Israel-Hamas war: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌- ఇజ్రాయెల్‌ (Israel-Hamas) యుద్ధం విషయంలో ఖతార్(Qatar) కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం నుంచి వైదొలిగినట్లు ఖతార్‌ స్పష్టం చేసింది. ‘ఖతార్‌ తన ఉద్దేశాలను 10 రోజుల క్రితమే సంబంధిత వర్గాలకు తెలియజేసింది. ఒప్పందం కుదరకపోతే హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను నిలిపివేస్తాం. గాజా స్ట్రిప్‌లో కొసాగుతున్న యుద్ధం కారణంగా అనేక మంది పౌరుల ఇబ్బందులు తగ్గించేందుకు ఇరువర్గాలు సుముఖత వ్యక్తం చేసిన్నప్పుడే మా ప్రయత్నాలు పునరుద్ధరిస్తాం. దోహాలోని హమాస్‌ కార్యాలయాన్ని బహిష్కరిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. సంబంధిత అధికారులతో సంప్రదించేందుకు, బందీలు, ఖైదీల మార్పిడితో పాటు గాజాలో శాంతి పునరుద్ధరణకు ఆ కార్యాలయం దోహదపడుతుంది’ అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డా.మజీద్ బిన్ మహ్మద్ అల్ అన్సారీ పేర్కొన్నారు.

హమాస్ ఏమందంటే?

మరోవైపు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేయాలని ఖతార్ తీసుకున్న నిర్ణయం తమకు ముందే తెలుసని హమాస్‌ సీనియర్‌ అధికారు ఒకరు తెలిపారు. 2012 నుంచి దోహాలో హమాస్‌ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్‌, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. కాగా.. ఇటీవల జరిగిన చర్చల్లో కాల్పుల విరమణ ప్రతిపాదనలను హమాస్‌ నేతలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో దోహాలో హమాస్‌ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా (USA) సూచించగా.. ఖతార్‌ దాన్ని అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. అవన్నీ నిజం కాదని ఖతార్ తెలిపింది. అలానే, మద్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed