- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BB Telugu 8 Promo: కంటెస్టెంట్ల గెటప్ చూసి ఆశ్చర్యపోయిన నాగార్జున..!!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ షో అయిన తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) రియాలిటీ షో మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సీజన్ పదవ వారానికి వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వీక్ హరితేజ(Hariteja) హౌస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. తాజాగా నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో శుక్రవారంతో పోలింగ్ కంప్లీట్ అయ్యింది. అందులో హరితేజ లీస్టులో ఉందని.. కాగా తొంభై శాతం ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు జనాలు. ఇక గంగవ్వ(Gaṅgavva) మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో లేదు.
అయినప్పటికీ ఆమె హెల్త్ సహకరించడం లేదని.. స్వయంగా తనే కింగ్ నాగార్జున(King Nagarjuna)ను ఇంటికి పంపించమని అడిగింది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో నాగ్.. గంగవ్వను ఎలిమనేట్ చేసి.. పంపించేశాడు. ఇకపోతే తాజాగా ఆదివారానికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంటెస్టెంట్లంతా.. జంబలకడిపంబ లాగా మారిపోయారు. అమ్మాయిలు అబ్బాయిల్లాగా.. అబ్బాయిలు అమ్మాయిల్లా గెటప్ వేసి ప్రేక్షకుల్ని అలరించారు. నాగార్జున సైతం వీరి అవతారం చూసి షాక్ అయ్యారు. అయితే నాగార్జున.. విష్ణు ప్రియ(Viṣṇu priya), పృథ్వీ(Pr̥thvī) తో ఉన్నప్పుడు ఎలా యాక్ట్ చేస్తుందని అలా నటించి చూపించమని అడుగుతాడు. దీంతో విష్ణు ప్రియా గెటప్ లో ముక్కు అవినాష్.. పృథ్వీ గెటప్ లో విష్ణు ప్రియ తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొడతారనుకోండి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.