- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరలో భారత్ లో బుల్లెట్ రైళ్లు : నరేంద్ర మోడీ
దిశ, మేడ్చల్ బ్యూరో/కాప్రా : రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రైల్వేల ఆధునికీకరణతో దేశం ముఖ చిత్రాన్నే మారుస్తుందన్నారు. ఇందులో భాగంగానే వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. త్వరలోనే భారత్ లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుందని వెల్లడించారు. స్టేట్ ఆఫ్ టెక్నాలజీతో రూ.413 కోట్ల వ్యయంతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను సోమవారం మధ్యాహ్నం ప్రధాని వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవంలో వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు పాల్గొనగా, చర్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ,మాజీ శాసన సభ్యులు ఎన్వీఎస్ ప్రభాకర్, కలెక్టర్ గౌతమ్ పోట్రు, కీసర ఆర్డీఓ పులి సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ.. అత్యాధునిక వసతులతో ఎయిర్ఫోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ ను నిర్మించినట్లు తెలిపారు. ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని, తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతుందన్నారు.
సోలార్ స్టేషన్ గా దీన్ని అభివృద్ది చేశారని మోడీ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసమన్నారు. 2014లో కేవలం 5 నగరాల్లో మెట్రో ఉందని, పదేళ్లలో 21 నగరాలలో 1,000 కిలో మీటర్ల మెట్రో నెట్ వర్క్ విస్తరించిందని ప్రధాని పేర్కొన్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో రైల్వేను కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. గడిచిన పదేళ్లలో 30వేల కిలో మీటర్ల రైల్వే లైన్లను నిర్మించినట్లు తెలిపారు. భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు.చర్లపల్లి రైల్వే టెర్మినల్ తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ ఉందని, దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తయిందన్నారు. వర్చువల్ గా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ దేశ అభివృద్దికి రైల్వేల పాత్ర కీలకమన్నారు.
తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ది కూడా రైల్వేలపైనే ఆధార పడి ఉందన్నారు. హైదరాబాద్ లోని చర్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్, స్టేషన్ ను పూర్తి చేసినందుకు కేంద్రానికి సీఎం కృతజ్ఠతలు తెలిపారు. ఒక ట్రిలియన్ డాలర్ జీడీపీ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు వెల్లడించారు. భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి తాము మావంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డైరెక్ట్ రైల్వే నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణలో 370 కిలో మీటర్ల రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలని విజ్ఠప్తి చేశారు.హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపించామని, మెట్రో రైల్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలన్నారు. వికారాబాద్ నుంచి కృష్ణా రైలు మార్గాన్ని, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు, డోర్నకల్ నుంచి రెండు లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ...వందే భారత్ తో రవాణా వ్యవస్థలో విప్లవం తీసుకువచ్చారని తెలిపారు. రైళ్ల ప్రమాదాలను నివారించే కవచ్ ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించారని పేర్కొన్నారు.
రింగ్ రోడ్ దగ్గరలో ఉండడం వల్ల చర్లపల్లి ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ది చేస్తున్నామని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ.730 కోట్లతో అధునీకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లను అధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. రైలు కూత వినిపించని ప్రాంతాలకు రైల్వే లైన్లు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు వచ్చాయని, త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రాబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభవుతుందన్నారు. లక్ష కోట్లతో జాతీయ రహదారులను విస్తరిస్తున్నామని, కాజీపేటలో రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం రూ.1000 కోట్లను ఇవ్వాలని గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, అయినా స్పందించలేదన్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను యాదగిరిగుట్ట వరకు పొడిగించామని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే లక్షల మంది ప్రయాణికులు యాదగిరి గుట్ట వరకు వెళ్లారని, కొమరవెళ్లి స్టేషన్ ను కూడా నిర్మిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. చర్లపల్లి స్టేషన్ కు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ వెంట చెత్త చెదారం నిండిపోయే కంపు కొట్టేదన్నారు.
కానీ ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక రైల్వే స్టేషన్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్ గా మారిపోయినట్లు తెలిపారు. రూ.32 వేల కోట్లు రైల్వే స్టేషన్ లలో అభివృద్ది చేసేందుకు కేంద్రం సహకరించిందన్నారు. అమృత్ స్కీం కింద 2 వేల కోట్లు తెలంగాణలో ఉన్న స్టేషన్లు అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కావడం ఎంతో సంతోషమన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రైల్వేల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చర్లపల్లి స్టేషన్ అప్రోచ్ రోడ్డుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అప్రోచ్ కోసం కేంద్ర సహకారం అందించాలని కోరారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని రైల్వే లైన్లను ఎలక్ట్రికల్ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్ లను తలపించేలా నిర్మిస్తున్నామని, చర్లపల్లి రైల్వే స్టేషన్ పారిశ్రామిక వాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
Also Read..