కారులో ప్రేమజంట సజీవదహనం కేసులో BIG ట్విస్ట్

by Gantepaka Srikanth |
కారులో ప్రేమజంట సజీవదహనం కేసులో BIG ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్(Medchal) జిల్లా ఘట్‌కేసర్‌(Ghatkesar) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కారులో ఇద్దరు సజీవదహనం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కారులో ప్రేమజంట ఆత్మహత్య(Love Couple Suicide)కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించరు. మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌‌కు చెందిన శ్రీరామ్‌, మేడ్చల్ జిల్లా నారపల్లి చెందిన లిఖితగా గుర్తించారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కారులోపలే ఉండి పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలంలో మూడు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed