- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Amith Sha : జవాన్ల మరణం బాధాకరం : అమిత్ షా
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chatthisghad)లో నేడు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 9 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) స్పందించారు. జవాన్ల మరణం బాధాకరం అని తెలిపిన అమిత్ షా.. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జవాన్ల బలిదానాలు ఊరికే పోవని, ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. భారత్ లో మావోయిస్టులు అనే పేరే లేకుండా చేస్తామని, 202 వరకు మావోయిస్టు రహిత భారత్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్(Beejapur) జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న మార్గంలో ఐఈడీ బాంబులు(IED Bomb) అమర్చి వారి వాహనాన్ని పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునారు. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read..