HMPV ముప్పు.. ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన

by Jakkula Mamatha |
HMPV ముప్పు.. ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: చైనా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న HMPV వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) ఒకే రోజు నాలుగు కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు, గుజరాత్ లో ఒకటి కోల్‌కత్తాలో ఒకటి నమోదయ్యాయి. అయితే.. కర్ణాటక(Karnataka), గుజరాత్‌(Gujarat)లో హ్యుమాన్ మెటానిమో వైరస్ కేసులు బయటపడ్డ నేపథ్యంలో అప్రమత్తమైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Minister Satya Kumar Yadav) తెలిపారు.

ఈ తరుణంలో రాష్ట్రానికి వైరస్(Virus) వల్ల ఎలాంటి ముప్పు లేదని ఇప్పటికే ICMR ప్రకటించిందని స్పష్టం చేశారు. నూతన వైరస్ పై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. ఈ క్రమంలో కావాల్సిన వైద్య పరికరాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. యాంటీ డ్రగ్ డోస్(Anti drug dose) మందులు కూడా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రొటోకాల్ అమలు చేస్తున్నాం అని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story