ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే..?

by Mahesh |
ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే..?
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ(Technology)తో పాటు ప్రజలు పరుగు పెడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌తో పాటు అనేక దేశాల్లో డిజిటల్ సేవలు(Digital services) అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా నగదు రహిత ఆన్ లైన్ సేవలు, యూపీఐ పేమెంట్లు.. ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకొని పలువురు దుండగులు ఆన్ లైన్ మోసాల(Online scams)కు పాల్పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా కొందరు వ్యక్తులు తమ లావాదేవీలను ఈజీగా చేసుకునేందుకు.. ఈజీ పాస్‌వర్డ్‌(Easy password)లను పెట్టుకుంటున్నారు. ఇది సైబర్ నేరగాళ్లకు సువర్ణావకాశం గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఃఇదే వ్యవహారంపై ఇటీవల ఓ ప్రముఖ సంస్థ సర్వే నిర్వహించగా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈజీ ఉండేందుకు గాను అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మొదలైన వాటికి ఈజీ పాస్ వర్డ్(Easy password)లను ఉపయోగిస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా, 1234, 123456, 123456789, 123123, 111111, 143143,1234567890,1234567 వంటి పాస్ వర్డులను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పాస్ వర్డులను ఉపయోగించడం వల్లనే చాలా మంది తమ డబ్బులను పోగొట్టుకున్నారు. ఇలాంటి పాస్ వర్డుల అన్ని చెత్తగా ఉంటాయని.. వాటిని వాడకపోవడమే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed