- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
NTR: కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనం అని అమ్మ అనేది.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన నేడు సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’(Devara) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ఈ రోజు తాను నటనలో, డ్యాన్సుల్లో ఓ ప్రత్యేకత సంపాదించుకోవడానికి కారణం తన అమ్మే అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నీ కంటూ ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడే, నీదంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటేనే నలుగురిలో గుర్తింపు వస్తుందని అమ్మ చెబుతుండేది. ఆమె మాటల ఇన్‌స్పిరేషన్‌తోనే కూచిపూడి నేర్చుకున్నాను. అమ్మ నుంచే అందరితో మాట్లాడటం తెలుసుకున్నా.
చాలామంది అమ్మలు తమ పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపించడానికి రకరకాల కారణాలతో ఒప్పుకోరు. మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లమనేది. ఏ విషయమైనా సొంతంగా తెలుసుకోమనేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనం అని చెబుతుండేది. కష్టపడ్డ వారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది. అందుకే నాకు హీరోగా ఎంతటి పేరొచ్చినా అమ్మ అసలు బయటకు రాదు. కష్టం నీదే కాబట్టి ప్రతిఫలం కూడా నీదే అనేది’ అని అమ్మ గురించి ఎన్టీఆర్ ఇంట్రేస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.