విశాలాంధ్ర పుస్తక మహోత్సవం.. 8:30 వరకు మాత్రమే

by srinivas |
విశాలాంధ్ర పుస్తక మహోత్సవం.. 8:30 వరకు మాత్రమే
X

దిశ, విశాఖపట్నం: విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి డిసెంబర్ 15 వరకు 23వ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్టు సీపీఐ నాయకులు పైడిరాజు తెలిపారు. నగరంలోని టర్నర్ సత్రం (చౌల్ట్రీ)లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. సాహితీమూర్తుల సాహిత్యంతో బాటు, ప్రముఖ తెలుగు ప్రచురణకర్తల పుస్తకాలు, అన్ని విషయాలపై సాహిత్యాన్ని సేకరించి ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అదే విధంగా ప్రముఖ ఆంగ్ల ప్రచురణకర్తలను, వివిధ రంగాలకు సంబంధించిన 60 మంది ప్రచురణకర్తలు, వుస్తకాలు, 25 వేల రకాల వుస్తకాలు సేకరించి ప్రదర్శనలో ఉంచుతున్నామన్నారు. ఈ నెల 14 నుండి వచ్చే నెల 15 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని పి.సంపత్ కుమార్ తెలిపారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed